schedule Thursday, September 03, 2026

శాంతి భద్రతల రక్షణకు కృషి చేయండి

calendar_today November 21, 2025
person dharshininews
శాంతి భద్రతల రక్షణకు కృషి చేయండి
శాంతి భద్రతల రక్షణకు కృషి చేయండి - పెద్దేముల్ ఎస్ఐకి జిల్లా ఎస్పీ సూచన - జిల్లా ఎస్పీని కలిసిన ఎస్ఐ శంకర్ తాండూరు, దర్శిని ప్రతినిధి: శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి పెద్దేముల్ ఎస్ఐకి సూచించారు. పెద్దేముల్ ఎస్ఐగా శంకర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఎస్ఐ శంకర్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణ రెడ్డిని ఎస్ఐ శంకర్ మర్యాద పూర్వకంగా కలిసారు. ఎస్పీ నారాయణ రెడ్డికి పుస్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖ పరంగా శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా దృష్టి సారించాలని అన్నారు. అదేవిధంగా ఎస్ఐ శంకర్ మాట్లాడుతూ విధుల్లో బాధ్యతాయుతంగా ఉంటూ శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు. ఇదికూడా చదవండి....   https://www.dharshininews.com/39774/