schedule Saturday, July 04, 2026

పల్లె పోరుకు మోగిన నగారా..!

calendar_today November 25, 2025
person dharshininews
పల్లె పోరుకు మోగిన నగారా..!
పల్లె పోరుకు మోగిన నగారా..! - నోటిపికేషన్ విడుదల చేసిన ఎన్నికల సంఘం - మూడు విడతల్లో ఎన్నికలు - ఎల్లుండి నుంచే నామినేషన్ల ప్రక్రియ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పల్లె పోరుకు నగారా మోగింది. పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 11వ తేదీన తొలి విడత, డిసెంబర్ 14వ తేదీన రెండో విడత, డిసెంబర్ 17వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మూడు ఎల్లుండి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు. మొదటి ఫేజ్ నామినేషన్ నవంబర్ 27వ తేదీ నుండి జరుగుతుందని, 30వ తేది నుంచి రెండవ విడత నామినేషన్‌, డిసెంబర్ 3వ తేది నుంచి మూడవ విడత నామినేషన్ డిసెంబర్ 3వ తేదీ నుండి జరుగుతాయని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ప్రత్యేక ఆన్‌లైన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్నికల వివరాలను అందులో తెలుసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39804/