schedule Wednesday, September 09, 2026

పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి

calendar_today November 29, 2025
person dharshininews
పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి
పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి - ప్రశాంతంగా ముగిసే వరకు అప్రమత్తం తప్పనిసరి - తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య - పెద్దేముల్ మండలంలో క్లస్టర్ కేంద్రాల పరిశీలన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పంచాయతి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు. శనివారం పెద్దేముల్ మండలంలోని పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ కేంద్రాలను డీఎస్పీ సందర్శించారు. పెద్దేముల్ ఎస్ఐ శంకర్‌తో కలిసి కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల వద్ద ఎన్నికల పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికలలో జరిగే పరిణామాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి ఒత్తిళ్లు, అక్రమ రవాణా, మద్యం అమ్మకాలపై ఇబ్బందులపై దృష్టిసారించాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతి గ్రామంలో శాంతిభద్రతలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39857/