schedule Tuesday, September 08, 2026

కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతిళ్లు

calendar_today December 3, 2025
person dharshininews
కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతిళ్లు
కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతిళ్లు - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అర్హులకు మంజూరు - ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభంలో నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ హాయాంలోనే పేదలకు సొంతిళ్లు నిర్మాణం అవుతున్నాయని తాండూరు నేతలు అన్నారు. తాండూరు పట్టణం 23వ వార్డులో బోయలక్ష్మీ అనే మహిళకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యింది. బుధవారం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గాజుల మాధవి, వార్డు వాల్మీకీనగర్ ఇంచార్జ్ భరత్ రెడ్డిల ఆధ్వర్యంలో ఆమె ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు. తాండూరులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని అన్నారు. పేదలు సొంతింటిని నిర్మించుకునేందుకు తోడ్పాటు అందిస్తుందని అన్నారు. నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకుంటే బిల్లులు మంజూరు అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాము, వార్డు ఆపీసర్ మ హేశ్వరి, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39908/