schedule Sunday, July 05, 2026

పల్లె పోరులో ఏకగ్రీవాల జాతర

calendar_today December 3, 2025
person dharshininews
పల్లె పోరులో ఏకగ్రీవాల జాతర
పల్లె పోరులో ఏకగ్రీవాల జాతర - తాండూరు నియోజకవర్గంలో 26 పంచాయతీలు - కాంగ్రెస్ మద్దతుతో ఓటింగ్ జరగకుండానే గెలుపు - హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మొదటి దశలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాతర కొనసాగింది. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజుతో ఏకగ్రీవ పంచాయతీల జాబితా తుది దశకు వచ్చింది. తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల, కోట్ పల్లి మండలాల్లోని ఏకగ్రీవ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల స్థానాలకు ఒక్కొక్క నామినేషన్లు ఉండడంతో ఆయా పంచాతీల స్థానాలు ఏకగ్రీవంగా ఖరారు కాబోతున్నాయి. తాండూరు మండలంలో ఇదిరవరకే చిట్టిగణాపూర్, రాంపూర్ మీది తాండాలు ఏకగ్రీవం కాగా తాజాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేజర్ పంచాయతీ అయిన కరణ్ కోట్, వీరారెడ్డిపల్లి, బిజ్వార్ ఏకగ్రీవం అవుతున్నాయి. యాలాల మండలంలో లక్ష్మీనారాయణపూర్, కిష్టాపూర్, సంగాయిగుట్ట తాండా, సంగెంకుర్దు, గంగాసాగర్, దేవుల తాండా, జక్కెపి, పేర్కంపల్లి తాండా, బండమీదిపల్లి, రేళ్లగడ్డ తాండా, సంగాయిపల్లి తాండాలు ఏకగ్రీవంగా నిలువబోతున్నాయి. పెద్దేముల్ మండలంలో రుద్రారం, చైతన్య నగర్, దుగ్గాపూర్, సిద్దన్నమడుగు తాండాలు ఏక్రగీవం కానున్నాయి. బషీరాబాద్ మండలంలో మంతన్ గౌడ్, బాబునాయక్ తాండా, హంక్యానాయక్ తాండా, బాడ్లాపూర్ లు సర్పంచులు ఏకగ్రీవం అవుతున్నారు. కోట్ పల్లి మండలంలో లింగంపల్లి, బుగ్గాపూర్ గ్రామాలు కూడా ఏకగ్రీవం బాట పడుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో నియోజకవర్గంలోని అత్యధిక గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం బాట పడుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తూ ఏకగ్రీవ సర్పంచులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39910/