schedule Sunday, July 05, 2026

బీసీ ఉద్యమ అమరుడు సాయి ఈశ్వర్ చారీ

calendar_today December 6, 2025
person dharshininews
బీసీ ఉద్యమ అమరుడు సాయి ఈశ్వర్ చారీ
బీసీ ఉద్యమ అమరుడు సాయి ఈశ్వర్ చారీ - ఆయన కుటుంబ బాధ్యత ప్రభుత్వానిదే - బీసీ సంఘం జాతీయ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ - బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రాణత్యాగంకు పాల్పడిన సాయి ఈశ్వర్ చారీ బీసీ ఉద్యమ తొలి అమరుడని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ అభివర్ణించారు. శనివారం తాండూరు పట్టణంలోని విశాల్ మార్ట్ వద్ద రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర చారీకి బీసీ సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బీసీ సంఘం నాయకులు, యువత, బీసీ బంధువులు సాయి ఈశ్వర్ చారి గారి చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ సాయి ఈశ్వర్ చారి కుటుంబానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. బీసీ 42% రిజర్వేషన్లను తక్షణమే చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. యువత ఎవ్వరూ ఇలాంటి ఆత్మహత్యాత్మక చర్యలకు పాల్పడకూడదని, బీసీ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో, సంఘటితంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ జి మధుసూదన్ రావు, బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, విద్యావంతులు పర్యాద రామకృష్ణ, బీసీ నాయకులు బసవరాజ్, మంతటి రాజు, పరమేష్, జోసఫ్, లడ్డుగౌడ్, మధుసూదన్ గౌడ్, టైలర్ రమేష్, యాసర్, వెంకన్న, శ్రీనివాస్, చిన్న, విజయ్, మారుతి, ప్రతాప్ సింగ్, తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/39930/