schedule Tuesday, September 08, 2026

అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం

calendar_today December 12, 2025
person dharshininews
అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం
అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం - వైద్య సేవలు అందించిన సిబ్బంది - తల్లీ, బిడ్డా క్షేమం.. ఎంసీహెచ్‌కు తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి : అంబులెన్స్‌లో గర్భిణి ప్రసవించింది. ఈ సంఘటన తాండూరు నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో జరిగింది. అంబులెన్స్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దేముల్ మండలం మదనంతాపూర్ గ్రామానికి చెందిన జైనాబాయి నిండు గర్భిణీగా ఉంది. శుక్రవారం పురుటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. సమాచారం అందుకున్న ధారూర్ అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. గర్భిణీని అంబులెన్స్‌లో ఎక్కించుకుని తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)కు తరలించారు. మార్గమద్యలోని కందనెల్లి వద్దకు రాగానే జైనాబాయిని పురుటినొప్పులు ఎక్కువయ్యాయి. అంబులెన్స్ ఈఎన్‌టీ ప్రకాష్‌ వైద్యుల సూచన మేరకు గర్భిణికి వైద్య సేవలు అందించారు. ఈ ప్రసవంలో జైనాబాయి పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డా క్షేమంగా ఉన్నారు. దీంతో వారికి తాండూరులోని ఎంసీహెచ్ ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌టీ ప్రకాష్‌తో పాటు పైలెట్ జావిద్ ఉన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/39993/