schedule Sunday, July 05, 2026

విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర...!

calendar_today December 14, 2025
person dharshininews
విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర...!
విజయవంతంగా పూర్తిచేసిన శబరిమల పాదయాత్ర...! - 38 రోజుల్లో 1280 కిలోమీటర్లు నడిచిన పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్, (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ) ఆపిల్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్), నమస్తే తెలంగాణ తాండూరు నియోజకవర్గం రిపోర్టర్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి సువర్ణభూమి శబరిమల పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో నవంబర్ 7వ తేది నుంచి డిసెంబర్ 14వ తేదీ వరకు 1280 కిలోమీటర్లు నడిచి వెళ్లి హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి గురుస్వామి మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలితంగా అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టే అదృష్టం వచ్చిందన్నారు. కాలినడకన శబరిమలకు వెళ్లడం వల్ల ఆధ్యాత్మికంగానే కాకుండా శారీరకంగా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. క్రమశిక్షణ, సంకల్పం పెంపొందించుకోవడం, భక్తిభావన పెరగడం, ఆత్మజ్ఞానం సంపాదించడం వంటివి ఉన్నాయన్నారు. ప్రకృతితో మమేకమయ్యే అవకాశం లభించిందన్నారు. అతి సామాన్యమైన వ్యక్తిగా యాత్రలోని కష్టాలను సహిస్తూ ముందుకు సాగడం వల్ల భగవంతునిపై భక్తితో పాటు నిత్యజీవితంలో ఎలా ఉండాలని తెలిసిందన్నారు. 38 రోజులు పాదయాత్రకు సహకరించిన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, పాఠశాల, కళాశాల సిబ్బందికి, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40031/