schedule Sunday, July 05, 2026

అతిథి అధ్యాపకులకు అన్యాయం

calendar_today December 16, 2025
person dharshininews
అతిథి అధ్యాపకులకు అన్యాయం
అతిథి అధ్యాపకులకు అన్యాయం - ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు - నోడల్ ఆఫీసర్ పాత్రపై విచారణ జరపాలి - బీసీ సంఘం కె. రాజ్ కుమార్ డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అతిథి అధ్యాపకుల నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. అవకతవకలకు పాల్పడినట్లు నోడల్ ఆఫీసర్‌పై వచ్చిన ఆరోపణల్లో ఆయన పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంగళవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని గెస్ట్ లెక్చరర్ల నియామకాల్లో నోడల్ ఆఫీసర్ శంకర్ నాయక్ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపించారు. నిబంధనల ప్రకారం అర్హులైన వారిని పక్కన పెట్టి నియామకాలు చేపట్టారని అన్నారు. గత 5-10 ఏండ్ల నుంచి పనిచేస్తున్న వారు తొలగింపుకు గురయ్యారని తెలిపారు. అర్హతలు ఉన్న అతిథి అధ్యాపకులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల్లో జరిగిన అవకతవకలలో నోడల్ ఆఫీసర్ పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి న్యాయం చేయాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లానాయకులు గడ్డం వెంకటేష్, మహిళ అధ్యక్షురాలు అనిత, కార్యదర్శి జగదీశ్వరి, నాయకులు కెఎన్ రాజు, సీహెచ్ జోసఫ్, బాబా గౌడ్. బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, యువనాయకులు టైరల్ రమేష్, యాసర్, అంతారం ప్రవీణ్, రాజుగౌడ్, నాగరాజు, శ్రీనివాస్, రాము, చిన్నా, రమేష్, వివేక్, కిరణ్ తదితులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40055/