schedule Sunday, July 05, 2026

మిషన్ భగీరథకు 'బ్రేకులు'..!

calendar_today December 16, 2025
person dharshininews
మిషన్ భగీరథకు 'బ్రేకులు'..!
మిషన్ భగీరథకు 'బ్రేకులు'..! - తాండూరు నెత్తిన తాగునీటి గండం - మండలాలకు, పట్టణానికి సరఫరాలో అంతరాయం - ఆయా ప్రాంతాలలో నీటి సరపరాలొ మార్పులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటికి తాగునీరు అందించే మీషన్ భగీరథ నీటి సరఫరాకు బ్రేకులు పడుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాలకు ఆపి.. ఆపి.. నీరు సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవడం ఆందోళనను కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. తాండూరు నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైభాగం నుంచి సరిఫరా నీరు రాకపోవడంతో నీటి సరఫరాకు అంతరాయాలు కలుగుతున్నాయి. దీంతో మిషన్ భగీరథ అధికారులు తాగునీటిని పొదుపుగా సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అధికారులు తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, పెద్దేముల్, బషీరాబాద్, యాలాల మండలాలతో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలో తాగునీటిని సరఫరా చేసే విభాగం అధికారులకు సూచనలు జారీ చేశారు. రాఘవపూర్ నీటి శుద్ధి కేంద్రానికి డిమాండుకు సరిపడా నీరు రావడం లేదని, ఈ కారణంగా తాగునీటి సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నట్లు వెల్లడించారు. దీంతో తాండూరు నియోజకవర్గంలో మిషన్ భగీరథకు బ్రేకులు పడుతున్నాయి. అంటే అధికారుల నిర్ణయం ప్రకారం.. ఒకరోజు ఓ మండలానికి నీరు సరఫరా చేస్తే.. మరో మండలంలో నీటి సరఫరా జరగదని, తాండూరు పట్టణానికి కూడా ఇదే విధానం అమలు చేయనున్నట్లు తెలిసింది. మిషన్ భగీరథ అంతరాయం కారణంగా ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40055/