schedule Tuesday, September 08, 2026

గప్పూర్ పాష కుటుంబానికి పైలెట్ పరామర్శ

calendar_today December 25, 2025
person dharshininews
గప్పూర్ పాష కుటుంబానికి పైలెట్ పరామర్శ
గప్పూర్ పాష కుటుంబానికి పైలెట్ పరామర్శ - కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణానికి చెందిన సీనీయర్ మైనార్టీ నేత, ముస్లిం వెల్ఫేర్ నాయకులు, ముర్షద్ దర్గాకు చెందిన గఫ్పూర్ పాష కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం గప్పూర్ పాష గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్టణంలోని ముర్షద్ దర్గా సమీపంలో ఉన్న వారి నివాసానికి చేరుకున్నారు. గఫ్పూర్ పాష సమాధి వద్ద మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, యూనుస్, జావిద్, ఇంతియాజ్ బాబ, చంటియాదవ్, పలువురు మైనార్టీ నేతలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40211/