schedule Tuesday, September 08, 2026

పుర పోరులో గులాబీ జెండా ఎగరేస్తాం

calendar_today December 28, 2025
person dharshininews
పుర పోరులో గులాబీ జెండా ఎగరేస్తాం
పుర పోరులో గులాబీ జెండా ఎగరేస్తాం - రోహిత్ రెడ్డి నాయకత్వంతో సత్తా చాటుతాం - వాల్మీకీనగర్‌లో కారు గెలుపును ఆపలేరు - బీఆర్ఎస్ యువనాయకులు సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి తీరుతామని బీఆర్ఎస్వీ తాండూరు పట్టణ అధ్యక్షులు, 23వ వార్డు ఇంచార్జ్ సందీప్ రెడ్డి అన్నారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ తాండూరులో బీఆర్ఎస్‌ హావా కొనసాగుతోందని తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటిందని గుర్తుచేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో మున్సిపల్‌పై మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. పట్టణంలోని 23వ వార్డులో బీఆర్ఎస్ గెలుపును ఎవ్వరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ప్రజలు, తాండూరు ప్రజలు అందరూ బీఆర్ఎస్, మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితోనే ఉన్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కేసీఆర్, కేటీఆర్, రోహిత్ రెడ్డిలకు కానుకగా ఇస్తామన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40242/