ప్రజా సేవే ధ్యేయం..!
December 29, 2025
dharshininews
ప్రజా సేవే ధ్యేయం..!
- సొంత ఖర్చులతో బోర్ మోటార్ల మరమ్మత్తులు
- కొడిచెర్ల సవితకు మాణిక్ నగర్ వాసుల అభినందనలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సేవే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ పరిధి పాతతాండూరుకు చెందిన కోడిచెర్ల సవిత వెంకటేష్ అన్నారు.
పట్టణంలోని 14వ వార్డులోని మాణిక్ నగర్లో మరమ్మత్తులకు గురైనా బోర్ మోటార్లను ఆమె తన సొంత ఖర్చులతో రిపేర్ చేయించారు. సోమవారం వార్డులోని బోర్లకు మరమ్మత్తులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ అండగా ఉంటామని అన్నారు. ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతామని అన్నారు. మరోవైపు మాణిక్ నగర్ వాసులు కొడిచెర్ల సవిత బోరు మోటార్లకు మరమ్మత్తులు చేయించి తాగునీటి ఎద్దడిని తీర్చడం పట్ల అభినందనలు తెలిపారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40282/