schedule Sunday, July 05, 2026

చదవుతో పాటు క్రీడల్లో రాణించాలి

calendar_today December 30, 2025
person dharshininews
చదవుతో పాటు క్రీడల్లో రాణించాలి
చదవుతో పాటు క్రీడల్లో రాణించాలి - మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి - తాండూరులో ఖోఖో టెర్నమెంట్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సెయింట్ మార్క్స్‌ స్కూళ్లో ఖోఖో టోర్నెమెంట్‌ ఘనంగా ప్రారంభించారు. స్కూల్‌ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి హాజరై ఖోఖో పోటీలను ప్రారంభించారు. టాస్ వేసి జట్ల మద్య పోటీలు ప్రారంభించారు. క్రీడాకారులకు కరచాలనం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం బాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక దృఢత్వం ఏర్పడుతుందన్నారు. అదేవిధంగా క్రీడా పోటీలతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడల్లో రాణించి పాఠశాలలకు, తల్లిండ్రులకు మంచి పేరు తీసుకరావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పీడీ అనంతయ్య, రాము, నరేందర్, రాము, గఫ్ఫార్, రాజశేఖర్, పలు పాఠశాలల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40308/