schedule Sunday, July 05, 2026

డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలి

calendar_today January 3, 2026
person dharshininews
డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలి
డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలి - బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం - మున్సిపల్ ముసాయిదా జాబితాపై అభ్యంతరం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో డబుల్, బోగస్ ఓటర్లను తొలగించాలని బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం డిమాండ్ చేశారు. శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ముసాయిదా ఓటర్ల జాబితాపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణంలోని 36వార్డులకు సంబంధించి ప్రదర్శించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని అన్నారు. ఒక వార్డు ఓటర్లు మరో వార్డులో చేర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఓటర్లు కూడా మున్సిపల్ పరిధి ఓటరు జాబితాలో ఉన్నారని ఆరోపించారు. దీంతో పాటు డబుల్ ఓట్లు కూడా నమోదు కావడం జరిగిందన్నారు. మున్సిపల్ అధికారులు ఓటరు జాబితాపై దృష్టిసారించాలని కోరారు. ముసాయిదా జాబితాలో డబుల్ ఓటర్లను, బోగస్ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్రమ్, భద్రప్ప తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40385/