schedule Sunday, July 05, 2026

ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..!

calendar_today January 3, 2026
person dharshininews
ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..!
ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ కుట్ర..! - బల్దియా పీఠం దక్కరాదని పన్నాగం - అక్రమ ఓటర్లను వెంటనే తొలగించాలి - యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడిందని యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో కొత్త ఓటర్ల చేరిక అనుమానాస్పందగా ఉందని అన్నారు. పట్టణంలోని ప్రతి వార్డులో ఇదివరకు ఉన్న ఓటర్ల కంటే సుమారు 500ల వరకు ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. ఏ వార్డులో అయినా కొత్త ఓటర్లు వందకు పైనే ఉండొచ్చని, కాని ఒకే సారి 500లకు పైగా ఓటర్లు నమోదు కావడం ఆశ్యర్యంగాను, అనుమానంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బల్దియా పీఠం కైవసం చేసుకుంటుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కుట్రలకు పాల్పడినట్లు ఆరోపించారు. ఎక్కడికక్కడ కొత్త ఓటర్లను తెచ్చి నమోదు చేయించారని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలనే ఉద్దేశంతోనే పన్నాగాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. సాయిపూర్‌లోని తన వార్డుతో పాటు ప్రతి వార్డులో అక్రమంగా నమోదైన ఓటర్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40391/