schedule Sunday, July 05, 2026

పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి

calendar_today January 4, 2026
person dharshininews
పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి
పట్టణంలో పల్లె ఓటర్లను తొలగించాలి - 23వ వార్డులో 200ల దొంగ ఓటర్లు..? - బీఆర్ఎస్ వార్డు ఇంచార్జ్ సందీప్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలో పంచాయతీ ఓటర్ల నుంచి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ 23వ వార్డు ఇంచార్జ్ పట్లోళ్ల సందీప్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పట్టణంలోని 23వ వార్డులో పంచాయతీలకు సంబంధించిన పల్లె ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వాళ్లు కూడా ఓట్లు వేశారని అన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు వేసేందుకు సిద్దమవుతున్నారని అన్నారు. వారితో పాటు వార్డులో సుమారుగా 200ల మంది ఓటర్లు అక్రమంగా నమోదు చేయబడ్డారని అన్నారు. వార్డులో బోగస్ ఓటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40402/