schedule Sunday, July 05, 2026

సమాజంలో ఉపాధ్యాయుల సేవలు కీలకం

calendar_today January 4, 2026
person dharshininews
సమాజంలో ఉపాధ్యాయుల సేవలు కీలకం
సమాజంలో ఉపాధ్యాయుల సేవలు కీలకం - టీచర్లు, విద్యారంగం బలో పేతానికి పీఆర్టీయూ కృషి చేయాలి - నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : సమ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో కీలకమని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు పట్టణంలో పీఆర్టీయూ టీఎస్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను శ్రీనివాస్ రెడ్డి పీఆర్టీయూ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు చేసే కృషి ఎనలేనిదని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యా వ్యవస్థబలోపేతంలో పీఆర్టీయూ కృషి చేయాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల హక్కులు, పరిరక్షకు కూడా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40406/