schedule Sunday, July 05, 2026

గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..!

calendar_today January 5, 2026
person dharshininews
గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..!
గొల్ల చెరువుకు మహర్దశ కల్పించండి..! - మినీ ట్యాంకుబండ్‌గా అభివృద్ధి చేయాలి - శివసాగర్ ప్రాజెక్టు పురోగతికి చొరవ చూపాలి - అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టనంలోని గొల్ల చెరువుకు మహర్దశ కల్పించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కొ రారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడారు. తాండూరు పట్టణంలోని ఏకైక జలాశయం గొల్ల చెరువు పరిస్థితిపై ప్రస్తావించారు. గొల్ల చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడంతో అందహీనంగా మారిందని అన్నారు. గొల్ల చెరువును మిని ట్యాంక్ బండ్ గా మార్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అదేవిధంగా యాలాల మండలంలోని శివసాగర్ ప్రాజెక్టు పురోగతిపై కూడా దృష్టి సారించాలని కోరారు. ప్రాజెక్టును అభివృద్ధి పరిచి రైతులకు ఉపయోగపడే విధంగా చొరవచూపాలని కోరారు. మరోవైపు గ్రావి ణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం ఇనుప స్థంబాలను ఏర్పాటు చేయడం జరిగిందని, వాటి వల్ల ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందన్నారు. విద్యుత్ షాక్ తగిలితే ప్రాణనష్టం జరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్థంబాలను మార్చి కొత్తగా వేరే స్థంబాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40422/