schedule Sunday, July 05, 2026

హమాలిబస్తీలో మురుగు తిప్పలు

calendar_today January 6, 2026
person dharshininews
హమాలిబస్తీలో మురుగు తిప్పలు
హమాలిబస్తీలో మురుగు తిప్పలు - నిధులు మంజూరు చేసి పనులు చేపట్టండి - మున్సిపల్ అధికారులకు వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లో మురుగు కాలువలు సక్రమంగా లేక ప్రజలు తిప్పలు పడుతున్నారని వార్డుకు చెందిన యువకులు అన్నారు. మంగళవారం తాండూరు మున్సిపల్ అధికారులకు వార్డుకు చెందిన యువకులు గోపాల్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. హమాలిబస్తీలో ఏండ్ల క్రితం నిర్మించిన మురుగు కాలువల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. కాలువలు సక్రమంగా లేకపోవడం వల్ల మురుగు రోడ్లపై ప్రవహిస్తోందని అన్నారు. కాలనీలు, పరిసరాలు దుర్గంధబరితంగా మారడంతో చిన్నారులు, పెద్దలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ఇప్పటికైనా వార్డులో మురుగు కాలువల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీలకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40428/