schedule Sunday, July 05, 2026

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి

calendar_today January 7, 2026
person dharshininews
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి - పార్టీలో పనిచేసే వారికి స్థాయి పదవులకు - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకోసం పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజకవర్గ పార్టీ నాయకులలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సంస్థాగత ఎన్నికల సన్నాహాక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ పరిశీలకులు రాంశెట్టి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు శ్రమించాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పనిచేయాలని అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. జిల్లా స్థాయి పదవుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. అర్హులైన వారికి సమయానుకూలంగా పదవులు వరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పోరేషన్ చైర్ పర్సన్ కల్వ సుజాత, డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, నాయకులు అబ్దుల్ రవూఫ్, లింక నర్సింలు, మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, మసూద్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, రాము, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40448/