schedule Tuesday, September 08, 2026

మున్సిపల్ ఓటరు జాబితా అనర్హులను తొలగించాలి

calendar_today January 8, 2026
person dharshininews
మున్సిపల్ ఓటరు జాబితా అనర్హులను తొలగించాలి
మున్సిపల్ ఓటరు జాబితా అనర్హులను తొలగించాలి - జిల్లా కలెక్టర్ కు బీఆర్ఎస్ నాయకుడి ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని ఓటరు జాబితాలో అనర్హులైన ఓటర్లను తొలగించాలని 3వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు అంజద్ ఖాన్ కోరారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని 3 వార్డులో కొందరు అనర్హులు ఓటరు జాబితాలో నమోదై ఉన్నారని ఫిర్యాదులో తెలిపారు. ఒకే ఇంటి నెంబర్ పై అత్యధిక ఓటర్లు నమోదై ఉన్నారని అన్నారు. వీరు గత పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉన్నారని తెలిపారు. ఈ ఓటర్ల వల్ల వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం ఉందని, కావున ఈ ఓటర్లను తొలగించాలని తాండూరు సబ్ కలెక్టర్, తహసీల్దార్లకు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జ్యోక్యం చేసుకుని అనర్హులైన ఓటర్లను తొలగించాలని ఫిర్యాదు ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40465/