schedule Sunday, July 05, 2026

తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ

calendar_today January 21, 2026
person dharshininews
తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ
తాండూరు మున్సిపల్ కమీషనర్ బదిలీ - ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ శాఖ - కొత్త కమీషనర్‌ నియామకం కూడా పూర్తి - నూతన కమీషనర్ ఎక్కడి నుంచి వస్తున్నారంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కమీషనర్ బి. యాదగిరి బదిలీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కమీషనర్ల బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా తాండూరు కమీషనర్ యాదగిరిని బదిలీ చేశారు. గత యేడాది ఆగస్టు నెలలో జరిగిన ఏసీబీ దాడుల నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న విక్రమ్ సింహారెడ్డిని బదిలీ చేయడంతో ఆయన స్థానంలో అదే నెలలో యాదగిరి తాండూరు కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా 5 నెలల పాటు యాదగిరి తాండూరు కమీషనర్ గా పనిచేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేశారు. తాండూరు మున్సిపల్ కొత్త కమీషనర్ గా ఇంద్రేశంలో కమీషనర్ గా పనిచేస్తున్న పి. మధుసూధన్ రెడ్డిని నియమించినట్లు తెలిసింది. తాండూరు కొత్త కమీషనర్ గా ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. https://www.dharshininews.com/40625/