schedule Sunday, July 05, 2026

ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తాం..!

calendar_today January 22, 2026
person dharshininews
ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తాం..!
ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తాం..! - ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు - తాండూరు మున్సిపల్ కొత్త కమిషనర్ మధుసూదన్ రెడ్డి - కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ  తాండూరు, దర్శిని ప్రతినిధి: వచ్చే మున్సిపల్ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తాండూరు మున్సిపల్ కొత్త కమిషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ పనిచేస్తున్న కమిషనర్ యాదగిరిని బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో ఇంద్రేశం మున్సిపల్ లో పనిచేస్తున్న మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు తాండూరు మున్సిపల్ కమిషనర్ గా మధుసూదన్ రెడ్డి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ యాదగిరి నుంచి ఛార్జ్ తీసుకుని భాధ్యతలు చేపట్టారు. అనంతరం కొత్త కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అందరి సహకారంతో వచ్చే మున్సిపల్ ఎన్నికలు సమర్థంగా నిర్వహిస్తామని అన్నారు. మరోవైపు కార్యాలయంలో అధికారులు కొత్త కమిషనర్ కు స్వాగతం పలికి పాత కమిషనర్ ను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో డీఈ మణిపాల్, మేనేజర్ నరేందర్ రెడ్డి, ఏఈ ఖాజా హుస్సేన్, పలు విభాగాల అధికారులు ఉన్నారు.   ఇది కూడా చదవండి...   https://www.dharshininews.com/40646/