schedule Tuesday, September 08, 2026

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..!

calendar_today January 22, 2026
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..!
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం..! - తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి - సాయిపూర్ లో బోరు పనులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణం 12వ వార్డు సాయిపూర్ లో కొత్తగా మంజూరు చేసిన తాగునీటి బోరు పనులు చేపట్టారు. మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డితో కలిసి బోరు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పట్టణ అభివృద్ధి జరగుఉతుందని అన్నారు. ఆయన ప్రత్యేక చొరవతో పట్టణంలోని వార్డుల్లో సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఇందులో భాగంగా 12వ వార్డులో తాగునీటి బోరు వేయించడం జరుగుతుందన్నారు. పట్టణంలో అన్ని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40649/