schedule Monday, September 07, 2026

వైభవంగా ‘సామూహిక’ అక్షరాభ్యాసం

calendar_today January 23, 2026
person dharshininews
వైభవంగా ‘సామూహిక’ అక్షరాభ్యాసం
వైభవంగా ‘సామూహిక’ అక్షరాభ్యాసం - అపిల్‌ కిడ్స్‌, శ్రీసాయిమేధాలో వసంత పంచమి శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : వసంతపంచమి వేడుకలు తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయం, ఆపిల్ కిడ్స్ స్కూల్లో శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. [video width="832" height="384" mp4="https://www.dharshininews.com/wp-content/uploads/2026/01/VID-20260123-WA1000.mp4"][/video] చదువుల తల్లి సరస్వతీ మాత పుట్టినరోజును పురస్కరించుకొని పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య తల్లిండ్రులు చిన్నారులకు భక్తిశ్రద్ధలతో అక్షరభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జ్ఞానం, వాక్కు, విద్య మొదలైన శక్తులే సరస్వతీ మాత అన్నారు. ఆంగ్ల మాద్యమంలో విద్యాబోధన జరిపినప్పటికీ దేశ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40685/