జయహో.. వందే భారత్..!
January 26, 2026
dharshininews
జయహో.. వందే భారత్..!
- కేవీసీఎస్ విద్యార్థుల అద్భుత వేడుక
- ఆకట్టుకున్న విభిన్న నృత్య ప్రదర్శనలు
- స్కూల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోటీ మహారాజ్ దేవాలయంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ హైస్కూల్లో వందే భారత్ నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది.
డైరెక్టర్లు వెంకటేశం, మల్లేశం, సతీష్ లతోపాటు విద్యార్థులు జాతీయ జెండాకు వందనం సమర్పించారు. విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ చేసి గౌరవ వందనం చేశారు. అనంతరం భారత దేశ సంస్కృతి, ఐక్యతను చాటేలా విద్యార్థులు చేసిన వందే భారత్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గిరిజన, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. గణతంత్ర దినోత్సవ వేడుకలలో జయహో అంటూ జాతీయ జెండాకు వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రశాంత్ మాట్లాడుతూ క్రిష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, స్వేచ్చ, ఐక్యత వంటి లక్షణాలను పెంపొందించేందుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40716/