schedule Monday, September 07, 2026

ఆర్ఎస్‌కే ఫౌండేషన్ సేవా స్పూర్తి..!

calendar_today January 26, 2026
person dharshininews
ఆర్ఎస్‌కే ఫౌండేషన్ సేవా స్పూర్తి..!
ఆర్ఎస్‌కే ఫౌండేషన్ సేవా స్పూర్తి..! - దామర్ చేడ్ పాఠశాలలో వంటశాల ఏర్పాటు - ప్రారంభించిన ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త తాండూరు, దర్శిని ప్రతినిధి : రొంపల్లి సంతోష్ కుమార్(ఆర్ఎస్‌కే) ఫౌండేషన్ సేవా స్పూర్తిని చాటుకుంది. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలంలోని దామర్ చేడ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వంటశాల ఏర్పాటుకు చేయూతను అందించింది. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్ గుప్త చేతుల మీదుగా వంటశాల గదిని ప్రారంభించారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటపోటీల విజేతలకు, నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ డా. రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో వంటశాల గదిని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విద్యార్థుల అభివృద్ధికి ఆర్ఎస్‌కే ఫౌండేషన్ ముందు ఉంటుందని అన్నారు. అంతకుముందు చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్‌ను పూలమాల, శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భారతి, శంకర్ స్వామి, పాఠశాల హెచ్ఎం, ఫౌండేషన్ సభ్యులు సోము, రఘు, సత్య, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40718/