schedule Sunday, July 05, 2026

మహిళలను మహరాణులను చేయడమే లక్ష్యం..!

calendar_today January 26, 2026
person dharshininews
మహిళలను మహరాణులను చేయడమే లక్ష్యం..!
మహిళలను మహరాణులను చేయడమే లక్ష్యం..! - సంక్షేమం, అభివృద్ధిలో మహిళలకు ప్రాధాన్యం - తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి - మున్సిపల్ ఆర్పీలకు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ.. మహరాణులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలకు ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద పీట వేస్తోందని అన్నారు. మహిళ సంఘాలకు వడ్డిలేని రుణాలు అందింస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు రూ.25 కోట్ల వడ్డిలేని రుణాలను అందించడం జరిగిందని తెలిపారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు ప్రత్యేక ప్రాదాన్యత ఇస్తోందని అన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమలులో ఆర్పీలు కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. వారి ఎలాంటి సమస్యలు ఉన్న పరిష్కరించేందుకు సహాకారం అందిస్తామన్నారు. మహిళలను మహరాణులను చేయడమే లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40720/