schedule Sunday, July 05, 2026

శంకరన్న ఇంకా ఉన్నతంగా ఎదగాలి

calendar_today January 26, 2026
person dharshininews
శంకరన్న ఇంకా ఉన్నతంగా ఎదగాలి
శంకరన్న ఇంకా ఉన్నతంగా ఎదగాలి - ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల శంకర్ రెడ్డి శుభాకాంక్షల వెల్లువ - సన్మానించిన స్వామి వివేకానంద కమిటి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూర్ నియోజకవర్గ ఆత్మ కమిటీ (అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ) చైర్మన్ పట్లోళ్ల శంకరన్న రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని పలువురు ఆకాంక్షించారు. ఇటీవల ఆత్మ కమిటి చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన పట్లోళ్ల శంకర్ రెడ్డికి సొంత గ్రామం రెడ్డి ఘనపూర్ పెద్దలు, స్వామి వివేకానంద కమిటీ సభ్యులు వెల్లువగా శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... తాండూర్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పట్లోళ్ల శంకర్ రెడ్డి నియామాకం సంతోషకరమని అన్నారు. తాండూర్ నియోజకవర్గ రైతులకు సేవలు అందిస్తూ, రానున్న రోజుల్లో రాజకీయంగా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దండోతి శ్రీనివాస్ ముదిరాజ్, మంగలి గోవింద్, మ్యాతరి బాలు మహారాజ్, అశోక్ ముదిరాజ్, తలారి బసంత్, చాకలి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40724/