తేలిన నామినేషన్ల లెక్క..!
January 31, 2026
dharshininews
తేలిన నామినేషన్ల లెక్క..!
- తాండూరులో 36 వార్డులకు 273 దాఖలు
- ఇందులో ఒక నామినేషన్ తిరస్కరణ
- 183 మంది అభ్యర్థుల పత్రాలు ఆమోదం
- ప్రకటించిన మున్సిపల్ అధికారులు
- ఏయే పార్టీ నుంచి ఎంతమంది ఉన్నారంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ లెక్క తేలిపోయింది. పట్టణంలోని 36వార్డులకు సంబంధించి మొత్తం 273 నామినేషన్లు దాఖలు కాగా ఒక నామినేషన్ రిజక్ట్ అయినట్లు అధికారులు ప్రకటింకారు.
శనివారం నామినేషన్ల పరిశీలన తరువాత అధికారులు పోటీకి అర్హులైన నామినేషన్ల అభ్యర్థుల జాబితాను ప్రదర్శించారు. తాండూరు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. శనివారం పోటీలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన జరిగింది. కార్యాలయంలో ఏర్పాటు చేసిన 12 కౌంటర్లలో ఆర్లు, ఏఆర్వోలు నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
మొత్తం 273 నామినేషన్లలో 1 నామినేషన్ తిరస్కరించినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థిని సంబంధించిన కుల దృవీకరణ పత్రం అందించకపోవడంతో రిజక్ట్ చేసినట్లు తెలిసింది. 36 వార్డుల్లో మొత్తం 183 మందికి అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్లను ఆమోదించడం జరిగిందని వెల్లడించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 55 మంది, బీఆర్ఎస్ నుంచి 59 మంది, బీజేపీ నుంచి 36 మంది, ఎంఐఎం నుంచి 15 మంది, బీఎస్పీ నుంచి 1, ఇతర పార్టీల నుంచి 7 మంది, స్వతంత్రులుగా 10 మంది నామినేషన్లను ఆమోదించినట్లు కమీషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ పక్రియ తరువాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్వోలు, ఏఆర్వోలు తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/40865/