schedule Monday, September 07, 2026

కుర్వ జగదీష్‌కు అస్వస్థత..!

calendar_today January 31, 2026
person dharshininews
కుర్వ జగదీష్‌కు అస్వస్థత..!
కుర్వ జగదీష్‌కు అస్వస్థత..! - మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు - బీజేపీ నేత రమేష్ కుమార్, కాంగ్రెస్ నేత పట్లోళ్ల నర్సింలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం సాయిపూర్ ప్రాంతానికి చెందిన బీజేపీ యువనాయకుడు కుర్వ జగదీష్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి పట్టనంలో ఓ ఆసుపత్రిలో చూపించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. శనివారం ఈవిషయం తెలుసుకున్న పలువురు నేతలు కుర్వ జగదీష్ ను పరామర్శించారు. శనివారం హైదరాబాద్ లోని దక్కన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుర్వ జగదీష్ ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు పరామర్శించారు. జగదీష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పట్లోళ్ల నర్సింలు మాట్లాడుతూ కుర్వ జగదీష్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని చెప్పారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40867/