schedule Sunday, July 05, 2026

మాటివ్వండి.. మరవకుండా ఓటేయండి..!

calendar_today February 2, 2026
person dharshininews
మాటివ్వండి.. మరవకుండా ఓటేయండి..!
మాటివ్వండి.. మరవకుండా ఓటేయండి..! - పార్టీలకతీతంగా అభివృద్ధి చేస్తా - 23వ వార్డులో జోరుగా పరిమళ రవీందర్ ప్రచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో మరవకుండా ఓటు వేసి గెలిపించాలని తాండూరు మాజీ కౌన్సిలర్ పరిమళ రవీందర్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాను పోటీ చేస్తున్న 23వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ మహిళలతో కలిసి గులాబీ కండువాలు కప్పుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఓటర్ల చేతిలో చేయి వేసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ అల్లుకుపోతున్నారు. పెద్దల ఆశీర్వదాం తీసుకుంటూ.. మరవకుండా ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఇచ్చిన హామిలన్నీ అమలు చేస్తానని అన్నారు. పార్టీలకతీతంగా వార్డు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృసి చేస్తానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40890/