schedule Monday, September 07, 2026

ఇంటింటా బీజేపీ ప్రచారం..!

calendar_today February 3, 2026
person dharshininews
ఇంటింటా బీజేపీ ప్రచారం..!
ఇంటింటా బీజేపీ ప్రచారం..! - కమలం పువ్వుకు ఓటేయండి - మాజీ కౌన్సిలర్ సాహు శ్రీలత తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం 24వ వార్డులో ఇంటింటా బీజేపీ ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఎన్నికల్లో వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్న సాహు శ్రీలత లక్ష్మీకాంత్ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. వార్డులో సాహు శ్రీలత ఇంటింటికి తిరిగి కమలం పువ్వుకు ఓటేయాలని కోరుతున్నారు. పేదల కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పేదలకు ఉచిత బియ్యం, సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు కూడా మంజూరు చేస్తుందని తెలిపారు. బీజేపీ పథకాలు అమలు అయ్యేలా చూడడంతో పాటు కౌన్సిలర్ గా వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అలంపల్లి శ్రీనివాస్, శేఖాపురం ఆంజేయులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఇదికూడ చదవండి... https://www.dharshininews.com/40950/