schedule Sunday, July 05, 2026

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

calendar_today February 4, 2026
person dharshininews
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి - కేసీఆర్ హాయాంలోనే అభివృద్ధి - మున్సిపల్‌పై గులాబీ జెండా ఎగరాలి - తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కోరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం పట్టణంలోని 1, 21, 22, 23వా వార్డులలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఆయా వార్డులలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. మాజీ కౌన్సిలర్ పరిమళ నివాసంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం పలువురు నివాసాలకు వెళ్లి పరిమళ రవీందర్ ను గెలిపించాలని కోరారు. అనంతరం వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాయాంలోనే, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే తాండూరు అభివృద్ధి జరిగిందన్నారు. రెండేళ్లు పాలించిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలన్నారు. వచ్చే మూడేళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కావున మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని బల్దియాపై గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డలి రవీందర్, దర్మీది రవీందర్, కేశవరావు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/40981/