schedule Sunday, July 05, 2026

ఆరు గ్యారెంటీలకు ఆగమైనమ్..!

calendar_today February 5, 2026
person dharshininews
ఆరు గ్యారెంటీలకు ఆగమైనమ్..!
ఆరు గ్యారెంటీలకు ఆగమైనమ్..! - మోసం చేసిన హస్తానికి బుద్ది చెప్పాలి - మున్సిపల్‌లో బీఆర్ఎస్ జెండా ఎగరబోతోంది - అభివృద్ధి, పాలన మీ ఇంటివద్దకే రావడం ఖాయం - ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి - తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న ఆరు గ్యారెంటీలకు ఆశపడి ఆగమై పోయాయమని, మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం పార్టీకి బుద్ది చెప్పాలని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని మలరెడ్డిపల్లిలో 1, 24వ వార్డులలో స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అసెంబ్లీ ఎన్నికలో ఓట్లు దండుకొని పారిపోయారని విమర్శించారు. రూ.2 వేల నుంచి రూ.4 వేల ఫించన్ ఇవ్వలేదని, మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఇవ్వలేదని, మహిళలను కోటీశ్వరులను చేస్తామనడం ఉత్తిమాటే అన్నారు. కణలక్ష్మీ కింద మనం రూ.లక్ష ఇస్తే వారు తులం బంగారం ఇస్తామన్నారు.ఎవరికైనా తులం బంగారం ఇచ్చారా.. అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ను మరోసారి నమ్మి మోసపోరాదని అన్నారు. గతంలో నేను మంజూరు చేసిన వార్డుకు కోటి రూపాయల నిధులతో శివాజీ చౌక్ నుండి మలరెడ్డిపల్లి శివారి వరకు రోడ్డు నిర్మించారని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో తాండూరు మునిసిపాలిటీపై బిఆర్ఎస్ జెండా ఎగరబోతోందని దీమా వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమంతో పాటు పాలను ఇంటివద్దకే రాబోతుందని అన్నారు. కావున మున్సిపల్ ఎన్నికల్లో 1వ వార్డు అభ్యర్థి నాగలక్ష్మి అనంత రెడ్డి, 24వ వార్డులో కొట్రిక నాగలక్మి శ్రీకాంత్‌లను గెలిపించాలని కోరారు. మరోవైపు మలరెడ్డిపల్లి కి చెందిన యువనాయకుడు మిరియాన్ శ్రీకాంత్ రెడ్డి, మహిళా నాయకురాలు పద్మ పైలెట్ రోహిత్ రెడ్డి గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్, నేతుల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41013/