చేతికి ఓటు వేస్తే.. చెలగాటమే..!
February 6, 2026
dharshininews
చేతికి ఓటు వేస్తే.. చెలగాటమే..!
- పాత తాండూరు అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్
- మున్సిపల్ ఎన్నికల్లో అన్ని అబద్దపు హామిలే
- ప్రగతిని నడిపించే కారు గుర్తుకే ఓటేయాలి
- తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
- పాత తాండూరులో బీఆర్ఎస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేస్తే మళ్లీ చెలగాటం ఆడుతుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం తాండూరు పట్టణం 13వ వార్డు, పాత తాండూరు 14, 15వ వార్డులలో బీఆర్ఎస్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు.
ఈ సమావేశాలకు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరై ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలకు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మోసం చేసిందని అన్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఫించన్ పెంచలేదని, మహిళలకు రూ. 2500లు ఇవ్వలేదని, తులం బంగారం ఊసే మరిచిందని విమర్శించారు. పాత తాండూరు రైల్వే బ్రిడ్జికి రూ. 74 కోట్లు తీసుకవస్తే నేటికి పనులు ప్రారంభించకుండా స్థానికులతో ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత తాండూరుకు తన హాయాంలోనే బస్తీ దవాఖానా వచ్చిందని గుర్తుచేశారు. రెండేళ్ల పాటు పాత తాండూరు అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని విమర్శించారు.
ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని పర్యటిస్తూ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేస్తే అభివృద్ధి, సంక్షేమం అమలు చేయకుండా చెలగాటం ఆడుతుందని హెచ్చరించారు. అభివృద్ధి, సంక్షేమం అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి హాట్రిక్ కౌన్సిలర్ శోభారాణి, యువనాయకుడు సురేష్ నాయక్, అబ్రార్ లాల సతీమణి నజియాలను భారీ మెజార్టీలతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/41046/