schedule Saturday, July 04, 2026

మున్సిపల్ ఎన్నికలపై నిఘా..!

calendar_today February 10, 2026
person dharshininews
మున్సిపల్ ఎన్నికలపై నిఘా..!
మున్సిపల్ ఎన్నికలపై నిఘా..! - పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు - డీఎస్పీలు, సీఐ, ప్రత్యేక బలగాలతో పహారా - తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక నిఘా ఉంచడం జరుగుతుందని డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. మంగళవారం తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. బుధవారం నుంచి జరగుబోతున్న మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా దృష్టి సారిస్తున్నామని అన్నారు. వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో నిఘా ఉంచడం జరుగుతుందన్నారు. పట్టణంలో 114 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ప్రతి పోలింగ్ కేంద్రాల పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇద్దరు డీఎస్పీలు, 12 మంది సీఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, ఇతర బలగాలు మొత్తం 200 మందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే, అవాంచనీయ సంఘటనలు జరిగితే డయల్ 100తో పాటు పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ సంతోష్‌ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/41149/