తాండూరులో బోగస్ ఓట్ల కలకలం..?
February 11, 2026
dharshininews
తాండూరులో బోగస్ ఓట్ల కలకలం..?
- ఓటు వేసేందుకు వచ్చిన నలుగురు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విచారణ జరిపేందుకు నిర్ణయం..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో బోగస్ ఓట్లు వినియోగయత్నం కలకలం రేపింది. ఓటు వేసేందుకు వచ్చిన నలుగురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. తాండూరు పట్టణంలోని అన్ని వార్డులతో పాటు 7వ వార్డుకు కూడా పోలింగ్ జరుగుతుంది.
ఈ వార్డు కోసం తాండూరు పట్టణంలోని నేతాజీ గురుదేవ్ గురుకుల్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఈ కేంద్రంలో ఓటు వేసేందుకు ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి వచ్చారు. వారి వద్ద ఉన్న ఓటింగ్‌కు కార్డులు అనుమాన్సదంగా కనిపించడంతో పోలిసులు వారిని విచారించారు. ఈ విచారణలో కార్డు వివరాలు, వారి వివరాలకు పొంతన లేకుండా పోయింది. దీంతో వారిని పక్కన కూర్చోబెట్టారు.
. దీంతో వారు బోగస్ ఓట్లు వేసేందుకు వచ్చినట్లు అనుమనాలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపించాలని నిర్ణయించారు. అంతవరకు పోలీసులు వారిని అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపిన తరువాత తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ విచారణలో నిజమైన ఓటర్లు అని తేలితే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, బోగస్ ఓటర్లు అని తేలితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.
ఇదికూడా చదవండి...
https://www.dharshininews.com/41204/