schedule Saturday, July 04, 2026

కౌంటింగ్‌.. కౌంట్ డౌన్..!

calendar_today February 12, 2026
person dharshininews
కౌంటింగ్‌.. కౌంట్ డౌన్..!
కౌంటింగ్‌.. కౌంట్ డౌన్..! - రేపే.. మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు - రౌండ్‌, రౌండ్‌కు విజేతల వివరాలు - పకడ్బందీగా ఏర్పాటు చేసిన అధికారులు - టైం.. లెక్కింపు స్థలం.. ఎక్కడ.. ఎప్పుడంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. రేపు మున్సిపల్ ఓటు లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 7గంటల నుంచి లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతోంది. ఇందుకు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని మున్సిపల్ కమీషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. తాండూరు పట్టణంలోని 36వార్డులకు ఎన్నికలు జరగగా బ్యాలెట్ బాక్సులను తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్‌లో స్ట్రాంగ్‌ రూంకు తరలించడం జరిగిందన్నారు. సెయింట్‌ మార్క్స్‌ జూబ్లీ స్కూల్లోనే ఓట్ల లెక్కింపు జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గోన్న పీఓలు, ఎన్నికల సూపర్ వైజర్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కోసం రెండు కౌంటింగ్ రూంలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పట్టణంలోని 36వార్డులను దృష్టిలో ఉంచుకుని 12 వార్డులకు ఒక రౌండ్‌ చొప్పున మొత్తం 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని వివరించారు. రౌండ్‌ రౌండ్‌కు విజేతల వివరాలను ప్రకటించడం జరుగుతుందన్నారు. లెక్కింపు కేంద్రంలోకి పోటీ చేసే అభ్యర్థిని లేదా ఏజెంట్‌ను మాత్రమే అనుమతించడం జరుగుతుందని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల మాదిరిగా ఓట్ల లెక్కింపు కూడా ప్రశాంతంగా జరిగేలా అందరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/41165/