schedule Monday, September 07, 2026

బీజేపీలో ముగ్గురు మొనగాళ్లు..!

calendar_today February 13, 2026
person dharshininews
బీజేపీలో ముగ్గురు మొనగాళ్లు..!
బీజేపీలో ముగ్గురు మొనగాళ్లు..! - తాండూరులో త్రిమూర్తుల విజయం - వారి వార్డుల్లో ప్రభావం చూపని పార్టీలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి ముగ్గురు మొనగాళ్లు విజయం సాధించారు. నువ్వా.. నేనా.. అన్నట్లుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసినా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. తాండూరు మున్సిపల్‌లో 36 వార్డులు ఉండగా ఎన్నికల్లో బీజేపీ నుంచి 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. చివరకు ఇందులో ముగ్గురే విజయకేతనం ఎగురవేశారు. బీజేపీ నుంచి పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం 28వ వార్డునుంచి పోటీ చేయగా.. 23వ వార్డు నుంచి అంతారం కిరణ్‌ కుమార్ చేశారు. 33వ వార్డు నుంచి శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశారు. ఆయా వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మద్య గెలుపు ఓటములు నువ్వా.. నేనా అనే విధంగా ఉన్నాయని పలు సర్వేలు వెల్లడించాయి. అయినా కూడా 28వ వార్డులో నాగారం మల్లేశం 119 ఓట్ల మెజార్టీ, 23వ వార్డులో అంతారం కిరణ్ 291 ఓట్ల మెజార్టీ, 33వ వార్డులో శ్రీకాంత్‌ రెడ్డి 201 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. https://www.dharshininews.com/41272/