schedule Saturday, July 04, 2026

ఐదేళ్లు.. నిస్వార్థ సేవ చేస్తాం..!

calendar_today February 14, 2026
person dharshininews
ఐదేళ్లు.. నిస్వార్థ సేవ చేస్తాం..!
ఐదేళ్లు.. నిస్వార్థ సేవ చేస్తాం..! - గాంధీనగర్‌ ప్రజల ఆశీస్సులతోనే విజయం - 20వ వార్డు కౌన్సిలర్‌ నవీన సంతోష్‌ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికలలో గెలిపించిన వార్డు ప్రజల కోసం ఐదేళ్లు నిస్వార్థంగా పనిచేస్తామని తాండూరు పట్టణం 20వ వార్డు నూతన కౌన్సిలర్ నవీనా సంతోష్‌ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసిన నవీనా సంతోష్‌ గౌడ్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో ప్రత్యర్థి కాంగ్రెస్ యువనాయకుడు, చీఫ్‌ విప్ మహేందర్ రెడ్డి అనుచరుడుపై 98 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ సందర్భంగా నవీనా సంతోష్‌ గౌడ్ మాట్లాడుతూ వార్డు ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుకోసం అండగా నిలిచిన యువతకు, మహిళలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలు పెట్టుకన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని అన్నారు. వచ్చే ఐదేళ్లూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టిసారిస్తామని అన్నారు. తనకు అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, వార్డు ప్రజలకు రుణపడి ఉంటామని అన్నారు. తమ గెలుపుకోసం పనిచేసిన ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు వెంకటేష్‌ చారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. https://www.dharshininews.com/41292/