schedule Monday, September 07, 2026

పార్కులు, పారిశుధ్యంపై ఫోకస్..!

calendar_today February 19, 2026
person dharshininews
పార్కులు, పారిశుధ్యంపై ఫోకస్..!
పార్కులు, పారిశుధ్యంపై ఫోకస్..! - వార్డులో పర్యటించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి - శాంతినగర్ పార్కు తనిఖీ - ఆదర్శనగర్ లో మురుగు కాలువల పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో పారిశుద్ధ్యం, పార్కుల నిర్వహణపై మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి దృష్టి సారించారు. మునిసిపల్ చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి గురువారం తాండూరు పట్టణంలోని 28వ వార్డు శాంతినగర్ పార్కును ఆమె మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. పార్కులో సుందరీకరణ పనులు చేపట్టాలని సూచించారు. పార్కులో వాహనాల పార్కింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. పార్కులో పచ్చదనం పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఆదర్శనగర్ లో చైర్ పర్సన్ నీరజ బాల్ రెడ్డి పర్యటించారు. కాలనీలో మురుగు కాలువల నిర్వహణను పర్యవేక్షించారు. మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, రోడ్లపై మురుగు ఆరకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ నాగారం మల్లేశం, సానిటరీ ఇన్ స్పెక్టర్ వెంకటయ్య, జవాన్లు, సిబ్బంది ఉన్నారు. మరోవైపు చైర్ పర్సన్ ఆదేశాల మేరకు శాంతినగర్ పార్కుకు వారం రోజులపాటు తాళం వేసి సుందరికరణ పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.   https://www.dharshininews.com/41936/