schedule Monday, September 07, 2026

తప్పుడు కేసులలో న్యాయానిదే విజయం

calendar_today February 20, 2026
person dharshininews
తప్పుడు కేసులలో న్యాయానిదే విజయం
తప్పుడు కేసులలో న్యాయానిదే విజయం - రోహిత్ రెడ్డికి బేయిల్ మంజూరుపై హర్షం - బీఆర్ఎస్‌ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులో న్యాయమే గెలుస్తుందని బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 13న పట్టణంలోని సెయింట్ మార్క్స్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌ హాల్ వద్ద జరిగిన తోపులాట వివాదంపై మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు మరో 8 మంది పార్టీ నాయకులపై నమోదైన కేసులో హై కోర్టు బేయిల్ మంజూరు చేసింది. దీనిపై శుక్రవారం ఓ ప్రటకలో అబ్దుల్ సలీం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా రోహిత్ రెడ్డి, నేతలపై కేసులు నమోదు చేశారంటూ విమర్శించారు. అక్రమ కేసులు పెట్టినా హైకోర్టులో బేయిల్ మంజూరు కావడం చెంప పెట్టు లాంటిదని అన్నారు. ప్రస్తుతం బేయిల్ మంజూరు అయినా.. హైకోర్టుపై ఉన్న విశ్వాసంతో పోలీసులు పెట్టిన కేసును కూడా ఎత్తివేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. https://www.dharshininews.com/41974/