schedule Monday, September 07, 2026

వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా

calendar_today February 20, 2026
person dharshininews
వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా
వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటా - ఓడినా వార్డు అభివృద్ధికి పాటుపడతా - కాంగ్రెస్ నాయకులు మహేష్‌ సింగ్ ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని 31వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ యువనాయకులు మహేష్‌ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం ఆయన ఓప్రకటనలో మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడినా ప్రజల మనస్సుల్లో గెలిచానని అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో వార్డులు నిధులు తీసుకవచ్చేలా కృషి చేస్తానని అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని అన్నారు. https://www.dharshininews.com/41977/