schedule Monday, September 07, 2026

కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..!

calendar_today February 21, 2026
person dharshininews
కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..!
కౌన్సిలర్‌పై కత్తులతో ఎటాక్..! - దాడిలో గాయపడిన ఈర్షాద్ - మెరుగైన వైద్యం కోసం సీటికి తరలింపు - పోలీసులకు వాంగ్మూల ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్‌ 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షాద్‌పై కత్తులతో ఎటాక్ చేశారు. ఈ దాడిలో ఆయన గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈర్షాద్ కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఈర్షాద్ బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి 7వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందారు. అయితే శుక్రవారం రాత్రి ఈర్షాద్ బందువులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. బావ మరిది అయాజ్, అతని మిత్రుడు కలిసి దాడికి పాల్పడినట్లు కుటుంభీకులు తెలిపారు. దాడిలో ఈర్షాద్ గాయపడగా స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈర్షాద్ పక్కటెముకలకు దెబ్బలు తగలడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఈర్షాద్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. https://www.dharshininews.com/41981/