schedule Saturday, July 04, 2026

కుల దురహంకార ఘటనలు మళ్లీ జరగొద్దు..!

calendar_today February 24, 2026
person dharshininews
కుల దురహంకార ఘటనలు మళ్లీ జరగొద్దు..!
కుల దురహంకార ఘటనలు మళ్లీ జరగొద్దు..! - నాగర్‌ కర్నూల్‌ పసికందు మృతి దురదృష్టకరం - కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి - బీసీ సంఘం జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : నాగర్‌ కర్నూల్‌ కుమ్మెరలో జరిగిన కుల దురహంకార ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. కుమ్మెర గ్రామంలో అగ్రకులాల అహంకారంతో బీసీ రజక కుటుంబానికి చెందిన గణేష్–చంద్రకళ కుటుంబంపై జరిగిన అమానుష దాడి కారణంగా రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇటువంటి కుల దురాహంకార దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొమ్మెర ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై భౌతిక దాడులు జరగకుండా ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించి, కేసుకు సంబంధం ఉన్న వారందరిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాత విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని రాజ్‌కుమార్ డిమాండ్ చేశారు. https://www.dharshininews.com/42110/