schedule Monday, September 07, 2026

ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..!

calendar_today February 25, 2026
person dharshininews
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..!
ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి..! - మౌళిక సదుపాయాల కల్పనకు కృషి - మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి - పట్టణంలోని 35వ వార్డులో పర్యటించిన చైర్ పర్సన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టిసారించడం జరుగుతుందని మున్సిపల్ చైర్ పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పట్టణం 35వ వార్డులో ఆమె పర్యటించారు. వార్డులలో కాలనీలో తిరగుతూ సమస్యలను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ దీపాలు, మురుగు కాలువలు తదితర నిర్వహణ పనులను ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన పనులు, ఇబ్బందులను గుర్తించి మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి వార్డులో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. విద్యుత్ దీపాలు, తాగునీరు, మురుగు కాలువల నిర్వహణ సమస్యలు లేకండా చూడాలని సూచించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో పార్టీలకతీతంగా పట్టణాన్ని అభివృద్ధి పరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. https://www.dharshininews.com/42131/