schedule Monday, September 07, 2026

ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండాలి

calendar_today February 28, 2026
person dharshininews
ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండాలి
ప్రతి ఒక్కరు భక్తి భావన కలిగి ఉండాలి - ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి - వాల్మీకీ దేవాలయ వార్షికోత్సవంలో పూజలు - వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రతి ఒక్కరూ భక్తి భావం కలిగి ఉండాలని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు పట్టణం వాల్మీనగర్‌లో వెలసిన వాల్మీకీ ఓంకారేశ్వర స్వామి అభయ ఆంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణోత్సవం అంగరంగ వైభోగంగా జరిపించారు. ఈ వేడుకల సందర్బంగా ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి హాజరై దేవాలయంలో వాల్మీకీ మహర్షికి, శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. భక్తి భావాన్ని ప్రతి ఒక్కరు పెంపొందించుకోవాలని అన్నారు. దేవాలయ వార్షికోత్సవం సందర్బంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక నేతలు బుయ్యని సరళా రెడ్డిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటి సభ్యులు, వాల్మీకీ సంఘం ప్రతినిధులు, నేతలు భరత్ రెడ్డి, సందీప్ రెడ్డి, మహిళలు, భక్తులు తదితరులు ఉన్నారు. https://www.dharshininews.com/42196/