schedule Saturday, July 04, 2026

ఆర్యవైశ్య ఎన్నికల బరిలో ఇద్దరు సేవకులు

calendar_today March 11, 2026
person dharshininews
ఆర్యవైశ్య ఎన్నికల బరిలో ఇద్దరు సేవకులు
ఆర్యవైశ్య ఎన్నికల బరిలో ఇద్దరు సేవకులు - కోడూరు వినోద్, రొంపల్లి సంతోష్‌ కుమార్‌ ముమ్మర ప్రచారం - ప్యానల్‌ సభ్యులతో కలిసి ఇంటింటి కాన్వసింగ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. ఈ సారి జరుగుతున్న సంఘం ఎన్నికల్లో ఇద్దరు సేవకులు ఒకే ప్యానల్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా కోడూరు వినోద్ కుమార్, కార్యదర్శిగా రొంపల్లి సంతోష్‌ కుమార్‌లు బరిలో నిలిచారు. అధ్యక్షులుగా పోటీ చేస్తున్న కోడూరు వినోద్‌ కుమార్ ఆధ్యాత్మిక రంగంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రసిద్ది చెందారు. రొంపల్లి సంతోష్ కుమార్ సామాజిక సేవకుడుగా గుర్తింపు పొందారు. సంఘం ఎన్నికల్లో తమ ప్యానల్‌ సభ్యులు ఉపాధ్యక్షులు గా గూడుపల్లి అనిల్, ఉపకార్యదర్శి గా గుముడాలా గౌరి శంకర్, కోశాధికారి గా అయితే విజయ్ కుమార్‌లతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు. ప్రతి ఆర్యవైశ్య ఇంటికి వెళ్లి చేసిన అభివృధి కార్యక్రమాలు తెలియజేస్తు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తమ ప్యానల్‌ గెలిపిస్తే రాబోయే రోజులో అన్ని రంగాలో ఆర్యవైశులకు తోడుంటామని భరోసా కల్పిస్తున్నారు. వచ్చే రెండేళ్లు అందరికి అందుబాటులో ఉండి మరింత అభివృధి చేస్తామని ప్రచారం చేస్తున్నారు. కోడూరు వినోద్, రొంపల్లి సంతోష్ కుమార్, ప్యానల్‌ సభ్యుల ప్రచారంకు ఆదరణ లభిస్తోంది. https://www.dharshininews.com/42406/